నాలుగు కార్లు ఢీ | - | Sakshi
Sakshi News home page

నాలుగు కార్లు ఢీ

Jan 29 2026 6:10 AM | Updated on Jan 29 2026 6:10 AM

నాలుగ

నాలుగు కార్లు ఢీ

పలువురికి స్వల్పగాయాలు

జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రం శివారు ధరూర్‌ బ్రిడ్జి వద్ద స్పీడ్‌బ్రేకర్ల ఏర్పాటుతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం వేగంగా వచ్చిన కార్లు స్పీడ్‌ బ్రేకర్ల వద్ద అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లు ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలయ్యాయి. వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో స్పీడ్‌బ్రేకర్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

కొండగట్టు ఆలయ అర్చకులకు మెమోలు

మల్యాల: కొండగట్టు ఆలయ ఈవోకు వ్యతిరేకంగా ఈనెల 23న ధర్నాకు దిగిన అర్చకులకు ఈఓ మోమోలు జారీ చేసినట్లు తెల్సింది. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి లోకేశ్‌ జన్మదినం సందర్భంగా కొండగట్టులో పూజలు చేసేందుకు టీడీపీ నాయకులు రాగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. దీనిపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారని, దుర్భాషలాడారని అర్చకులు ఈవోకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేశారంటూ ఈఓ అర్చకులకు బుధవారం మెమోలు జారీ చేశారు.

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో ఏడుగురు ఉమ్మడి జిల్లావాసులు

జగిత్యాలజోన్‌: ఈనెల 30న జరిగే బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో 203 మంది పోటీ చేస్తుండగా.. వారిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఏడుగురు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా పనిచేస్తున్న కాసుగంటి లక్ష్మణ్‌కుమార్‌, సీహెచ్‌.ప్రదీప్‌కుమార్‌ రాజు, కె.సంజీవరెడ్డి, ఐ.సత్యనారాయణ, బాలసాని సురేశ్‌గౌడ్‌, పోలు వెంకటరాజ్‌కుమార్‌, కె.వేణుగోపాల్‌ ఉన్నారు. వీరితోపాటు మరో ఐదారుగురు ఉమ్మడి జిల్లాకు చెందినవారు ఉన్నప్పటికీ వారంతా హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

ధ్వంసమైన కార్లు

నాలుగు కార్లు ఢీ1
1/1

నాలుగు కార్లు ఢీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement