యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లు | - | Sakshi
Sakshi News home page

యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లు

Jan 29 2026 6:04 AM | Updated on Jan 29 2026 6:04 AM

యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లు

యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లు

తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మానేరువాగులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడిని జిల్లా గార్డు కానిస్టేబుళ్లు కాపాడారు. మండల కేంద్రానికి చెందిన సూర నవీన్‌(27) బుధవారం మానేరు బ్రిడ్జి పైనుంచి వాగులోకి దూకాడు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న డిస్ట్రిక్ట్‌ గార్డ్‌ కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్‌ వెంటనే వాగులోకి దూకి నవీన్‌ను ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి సంఘటన స్థలానికి చే రుకుని యువకుడికి కౌ న్సెలింగ్‌ ఇచ్చారు. వాగులోకి దూకి యువకుడిని కాపాడిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్‌ను ఎస్పీ మహేశ్‌ బీ గీతే అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement