పేదలకు విద్య అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదలకు విద్య అందించడమే లక్ష్యం

Jan 22 2026 8:25 AM | Updated on Jan 22 2026 8:25 AM

పేదలకు విద్య అందించడమే లక్ష్యం

పేదలకు విద్య అందించడమే లక్ష్యం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రతి పేదవాడికి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాజన్నపేటలో అంగన్‌వాడీ భవనం, మురుగుకాలువ నిర్మాణాలకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటికే 18 అంగన్‌వాడీ భవనాలు మంజూరు చేశామన్నారు. రాజన్నపేటలో ఉపాధిహామీ కింద రెండు అంగన్‌వాడీ భవనాలు మంజూరు చేశామని, ఎస్సీ కాలనీలో మురుగుకాలువ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. విదేశాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సాబేరాబేగం, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, సర్పంచ్‌ కల్లూరి బాపురెడ్డి, ఉప సర్పంచ్‌ యాదగిరి మాజీసర్పంచ్‌ ముక్క శంకర్‌, నాయకులు గౌస్‌, గుర్రాల రాజిరెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, బండారి బాల్‌రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement