వివాహేతర సంబంధంతోనే సతీశ్ హత్య
● ఏఎస్పీ రుత్విక్‌సాయి ● నలుగురి రిమాండ్
వేములవాడ: వివాహేతర సంబంధమే సతీశ్ హత్యకు కారణమైందని ఏఎస్పీ రుత్విక్‌సాయి తెలిపారు. హత్య కేసులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం వివరాలు వెల్ల డించారు. ఈనెల 13న కోలకాని సతీశ్ తీవ్ర గాయాలతో వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తే.. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ప్రణాళిక ప్రకారం నలుగురు కలిసి సతీశ్‌పై దాడి చేసినట్లు తేలిందన్నారు. తిప్పయ్యపల్లికి చెందిన ఉమ్మారెడ్డి విష్ణు, ఉమ్మారెడ్డి కృష్ణ, పెంట సుదర్శన్, మ్యాకల వేణు మద్యం సేవించి సతీశ్‌ను కర్రలు, ప్లాస్టిక్ పైపులతో కొట్టారు. అనంతరం ప్రమాదం జరిగినట్లు నటిస్తూ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సతీశ్ చనిపోవడంతో ఆ నలుగురు పరారయ్యారు. కాల్‌డేటా ఆధారంగా వారి కదలికలను గుర్తించి స్థానిక బైపాస్‌రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సై రాంమోహన్, పోలీసులు ఉన్నారు.


