సొమ్మొకరిది.. సోకొకరిది
● ఓట్లు అడిగే హక్కు బీజేపీకే ఉంది ● పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్లటౌన్: సొమ్కొకరిదైతే.. సోకొకరిది అన్నట్లు కాంగ్రెస్ సర్కారు తీరుందని బీజేపీ జిల్లా అధ్యక్షు డు రెడ్డబోయిన గోపి విమర్శించారు. సిరిసిల్లలోని తన నివాసంలో బుధవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. సిరిసిల్లకు కేంద్ర ప్రభుత్వం అర్బన్ డెవలప్ మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.15కోట్లు ఇస్తే.. వా టికి అదనంగా రూ.3కోట్లు కలిపి మొత్తం తామే ఇచ్చినట్లు వాటిని ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్ర భుత్వం సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. పట్టణ ప్రగతి కింద వచ్చిన రూ.30 లక్షలను సిబ్బంది వేతనాలకు వాడుతున్నారన్నారు. అమృత్ స్కీం కింద సిరిసిల్ల మున్సిపాలిటీకి రూ.104 కోట్లు మంజూరు చేస్తే.. రేవంత్‌రెడ్డి బామ్మర్ది కంపెనీకి టెండర్ వచ్చేలా చేసినట్లు ఆరోపించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, శీలం రాజు, మ్యాన రాంప్రసాద్ పాల్గొన్నారు.


