స్వతంత్రులకు గుర్తుల గుబులు ! | - | Sakshi
Sakshi News home page

స్వతంత్రులకు గుర్తుల గుబులు !

Feb 3 2026 7:18 AM | Updated on Feb 3 2026 7:18 AM

స్వతంత్రులకు గుర్తుల గుబులు !

స్వతంత్రులకు గుర్తుల గుబులు !

● ఒకటిని పోలినట్లు మరొకటి

సిరిసిల్ల: మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసే ఇండిపెండెంట్స్‌(స్వతంత్రులు) అభ్యర్థులకు కేటాయించే గుర్తులు తికమకపెట్టనున్నాయి. స్వతంత్రులకు కే టాయించే 75 గుర్తులతో కూడిన జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎయిర్‌ కండిషనర్‌, యాపిల్‌, పండ్లబుట్ట, బ్యాట్‌, బాటరీ టార్చి, బైనాక్యులర్స్‌, సీసా, బ్రెడ్‌, బకెట్‌, కెమెరా, క్యారమ్‌బోర్డు, చెయిన్‌, కుర్చీ, చపాతి రోలర్‌, కోటు, కొ బ్బరితోట, మంచం, కప్పుసాసర్‌, కటింగ్‌ ప్లేయర్‌ వంటి గుర్తులతో పాటు ఎవరూ గుర్తుపట్టని విధంగా కవరు, పిల్లనగ్రోవి, డంబెల్స్‌, ద్రాక్షపండ్లు, పచ్చిమిర్చి, అగ్గిపెట్టె, పెన్‌డ్రైవ్‌, ఊలు, సూది, టూత్‌పేస్ట్‌, వాల్‌నట్‌ వంటి గుర్తులను ఇచ్చారు. 75 గుర్తుల్లో చాలామటుకు ఒక్కటిని పోలినట్లు మరొకటి ఉండడం విశేషం. బ్యాట్‌, బాటరీ టార్చ్‌ ఒకేలా కనిపిస్తున్నాయి. బ్లాక్‌ అండ్‌ వైట్‌ బ్యాలెట్‌ పత్రాలు కావడంతో ఈ గుర్తులను గుర్తించడం కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement