సోలార్‌ ప్రాజెక్ట్‌.. గ్రిడ్‌కు అనుసంధానం | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ ప్రాజెక్ట్‌.. గ్రిడ్‌కు అనుసంధానం

Jan 28 2026 6:49 AM | Updated on Jan 28 2026 6:49 AM

సోలార్‌ ప్రాజెక్ట్‌.. గ్రిడ్‌కు అనుసంధానం

సోలార్‌ ప్రాజెక్ట్‌.. గ్రిడ్‌కు అనుసంధానం

సోలార్‌ ప్రాజెక్ట్‌.. గ్రిడ్‌కు అనుసంధానం

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నాగారంలో 2 మెగావాట్ల పీఎం– కుసుమ్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి చేసుకొని మర్తనపేటలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ వద్ద మంగళవారం ఎన్పీడీసీఎల్‌, రెడ్కో అధికారులు గ్రిడ్‌కు విజయవంతంగా అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ ఎస్‌ఈ రమేశ్‌బాబు మాట్లాడుతూ, రైతులు తమ పంట పొలాల్లో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి పీఎం–కుసుమ్‌ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తున్నాయని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెడ్కో జిల్లా మేనేజర్‌ మనోహర్‌ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 95 మంది రైతులు 125.9 మె గావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఎన్పీడీసీఎల్‌తో 25 ఏళ్ల వరకు అగ్రిమెంట్లు చేసుకున్నారని, ప్రతీ యూని ట్‌కు రూ.3.13 చొప్పున డిస్కం చెల్లిస్తుందని తెలిపారు. డిస్కం డీఈలు రాజం, చంద్రమౌళి, ఏడీఈలు సుధీర్‌, శ్రీనివాస్‌, ఏఈలు రవీందర్‌, రమేశ్‌, రెడ్కో డీవో మునీందర్‌ తదితరులుపాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement