రాష్ట్రానికి మొండిచేయి
వేములవాడ: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనేకసార్లు ప్రధానిని కలిసి విన్నవించినా రాష్ట్రాన్ని విస్మరించారు. రీజినల్ రింగ్ రోడ్డు, మూసి అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు నిధులు కేటాయించారు. క్రీడారంగంలోనూ తెలంగాణకు కేటాయింపులు లేవు. రాష్ట్రం నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా నిధులు సాధించలేకపోవడం బాధాకరం.
– ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్


