బడి వేళకు బస్సు రాదాయే.. | - | Sakshi
Sakshi News home page

బడి వేళకు బస్సు రాదాయే..

Jan 23 2026 7:00 AM | Updated on Jan 23 2026 7:00 AM

బడి వ

బడి వేళకు బస్సు రాదాయే..

బస్సుల వివరాలు

రీ షెడ్యూల్‌ చేస్తాం

గంటలకొద్దీ నిరీక్షణ

విద్యార్థులకు తప్పని కష్టాలు

నిత్యం స్కూల్‌కు ఆలస్యమే..

పొద్దుపోయాక ఇంటికి చేరుతున్న పిల్లలు

ఆందోళనలో తల్లిదండ్రులు

కోనరావుపేట(వేములవాడ): ఈ చిత్రం.. కోనరావుపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి వస్తున్న విద్యార్థులు. స్కూల్‌ సమయానికి ఒకే బస్సు నడుస్తుండడంతో అందరూ అందులోనే ఎక్కి వస్తున్నారు. కోనరావుపేట మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, తెలంగాణ మోడల్‌ స్కూల్‌కు సుద్దాల, కనగర్తి, నిజామాబాద్‌, వెంకట్రావుపేట, కొండాపూర్‌, నిమ్మపల్లి గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుద్దాల నుంచి కనగర్తి, నిజామాబాద్‌ మీదుగా కోనరావుపేటకు వస్తుంది. వెంకట్రావుపేట, కొండాపూర్‌ గ్రామాల నుంచి కోనరావుపేట కళాశాలకు, మోడల్‌ స్కూల్‌కు విద్యార్థులు వస్తున్నారు. ఈ గ్రామాలకు రెండు, మూడు రోజులుగా బస్సులు రాకపోవడంతో విద్యార్థులు ఆటోలో వస్తున్నారు.

బడి కోసం ప్రత్యేక బస్సులు : 11

పల్లెవెలుగు బస్సులు 59

బస్సులు

142

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఇలా.. ఆటోలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీరు ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేట మోడల్‌ స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులు. రహీంఖాన్‌పేట మోడల్‌స్కూల్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో మండలంలోని 35 గ్రామాల నుంచి విద్యార్థులు ఆటోలలో వస్తున్నారు. పాఠశాలలో 672 మంది విద్యార్థులు 36 ఆటోలలో ఇలా ప్రమాదకరంగా ప్రయాణించి వస్తున్నారు. ఒక్క ఆటోలో 17 మంది వరకు కిక్కిరిసి వస్తున్నారు.

సిరిసిల్లటౌన్‌: విద్యార్థులకు బస్సు కష్టాలు తప్పడం లేదు. విద్యాసంస్థల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు రాక కొందరు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తుండగా, మరికొందరు గంటలకొద్దీ రోడ్లపైనే ఎదురుచూస్తున్నారు. అసలే మారుమూల ప్రాంతాలు కావడం.. సమయానికి ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో స్కూళ్లు, కాలేజీలకు ఆలస్యంగా చేరుకుంటున్నారు. ఇలా నిత్యం ఆలస్యం అవుతుండడంతో పలువురు విద్యార్థులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బడివేళల్లో బస్సులు రాక విద్యార్థుల ప్రయాణ కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్‌రిపోర్టు.

జిల్లాలో 142 బస్సులు

జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడ, కార్మికక్షేత్రం సిరిసిల్లలో రెండు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను 142 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. గ్రామీణ రూట్లలో 59 బస్సులు షెడ్యూల్‌ ప్రకారం తిరుగుతున్నాయి. బడి, కళాశాలలకు వెళ్లే పిల్లల కోసమే 11 పల్లెవెలుగు బస్సులను తిప్పుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయితే సమయానికి బస్సులు రాక క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఒక రూట్‌లో ఒకే బస్సు వెళ్తుండడం.. విద్యార్థులు ఎక్కువగా ఉంటుండడంతో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తుంది. అంతేకాకుండా పలు స్టేజీలపై విద్యార్థులను చూస్తేనే బస్సులు ఆపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక సాయంత్రం వేళ బస్సుల కోసం గంటలతరబడి ఎదురుచూపులు తప్పడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.

జాతర్లతో మరిన్ని కష్టాలు

ఈనెలలోనే మేడారం జాతర మొదలు కాగా.. తర్వాత వేములవాడ శివరాత్రి జాతర రాబోతుంది. ఈజాతర్లకు సిరిసిల్ల, వేములవాడ డిపోల నంచి 70 బస్సులకు పైగా నడిపించనున్నారు. బడివేళల్లో బస్సుల కోసం విద్యార్థులు మరిన్ని కష్టాలు పడాల్సిన పరిస్థితులు రానున్నాయి.

మేడారం, వేములవాడ జాతర్లకు ప్రత్యేకంగా బస్సులు నడపాల్సి వస్తుంది. ఆ సమయంలో డిపోలో ఉన్న వాటితో విద్యాసంస్థల సమయాలకు బస్సులను రీషెడ్యూల్‌ చేస్తాం. ఈమేరకు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. బడి వేళల్లో రెండు డిపోల్లో బస్సులు నడుపుతూ పిల్లలను సమయానికి చేరవేసేలా సిబ్బందికి సూచనలు చేస్తున్నాం. విద్యార్థులను చూసి బస్సులు ఆపకుండా ఉండని పరిస్థిలు లేవు.

– ప్రకాశ్‌రావు(సిరిసిల్ల),

శ్రీనివాస్‌(వేములవాడ), డిపో మేనేజర్లు

బడి వేళకు బస్సు రాదాయే..1
1/4

బడి వేళకు బస్సు రాదాయే..

బడి వేళకు బస్సు రాదాయే..2
2/4

బడి వేళకు బస్సు రాదాయే..

బడి వేళకు బస్సు రాదాయే..3
3/4

బడి వేళకు బస్సు రాదాయే..

బడి వేళకు బస్సు రాదాయే..4
4/4

బడి వేళకు బస్సు రాదాయే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement