మొక్కులు చెల్లించి వస్తుండగా..
రామగుండం: పెద్దంపేట గ్రామంలో ముగ్గురు మహిళలు పోచమ్మ మొక్కులు తీర్చుకొని అంతర్గాంకు ఆటోలో వెళుతున్న క్రమంలో గురువారం మధ్యాహ్నం పెద్ద బావి మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అంతర్గాంకు చెందిన నేరెళ్ళ పద్మ, అమృతమ్మ తీవ్రంగా గాయపడగా, కుందనపల్లికి చెందిన దొంగల మల్లమ్మ, ఆటోడ్రైవర్ ఆంజనేయులుకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా అదే సమయంలో పెద్దంపేట వైపు టీటీఎస్ గ్రామ సర్పంచ్ అంబోతు రవికుమార్, పోలీసు జీపులో ఎస్సై వెంకటస్వామి వస్తుండడంతో క్షతగాత్రులను గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. కాగా విధి నిర్వహణలో వెళ్తున్న ఎస్సై క్షతగాత్రులను గుర్తించి చికిత్స నిమిత్తం పోలీస్ వాహణంలో తరలించడంపై స్థానికులు అభినందించారు.
అదుపుతప్పి ఆటో బోల్తా.. పలువురికి గాయాలు


