బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి

Jan 29 2026 6:04 AM | Updated on Jan 29 2026 6:04 AM

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి

● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌, సిరిసిల్ల ఇన్‌చార్జి తుల ఉమ

సిరిసిల్ల: మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు పనిచేయాలని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌, సిరిసిల్ల మున్సిపల్‌ ఇన్‌చార్జి తుల ఉమ కోరారు. తెలంగాణ భవన్‌లో బుధవారం పార్టీ నాయకులతో కలిసి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేశారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ‘సెస్‌’ చైర్మన్‌ చిక్కాల రామారావు, నాయకులు చీటి నర్సింగరావు, జిందం చక్రపాణి, సిద్ధం వేణు, సత్తార్‌ పాల్గొన్నారు.

11 మంది సిట్టింగ్‌లతోనే..

సిరిసిల్ల పట్టణంలో 39 వార్డులు ఉండగా..18 మందితో తొలిజాబితాను విడుదల చేసింది. గత కౌన్సిల్‌లో చైర్‌పర్సన్‌గా ఉన్న జిందం కళాచక్రపాణి, వైస్‌చైర్మన్‌గా ఉన్న మంచె శ్రీనివాస్‌ సతీమణి రేణుకతోపాటు మరో తొమ్మిది మంది సిట్టింగ్‌ కౌన్సిలర్లకు అవకాశం కల్పిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకత్వం అభ్యర్థులను ప్రకటించింది. గత మున్సిపల్‌ ఎన్నికల్లో స్వల్పఓట్లతో ఓడిపోయిన మరో ఐదుగురికి మళ్లీ అవకాశం కల్పించారు. కొత్త అభ్యర్థులు ఇద్దరికి టిక్కెట్లను ప్రకటించారు. 3వ వార్డులో జిందం కళాచక్రపాణి, 5లో దార్నం అరుణలక్ష్మీనారాయణ, 8లో లింగంపల్లి భాగ్యలక్ష్మిసత్యనారాయణ, 9లో దొంతునేని కల్యాణిఅశోక్‌రావు, 12లో మొగిలి నాగరాజు, 13లో బుర్రనారాయణ, రాజు, 16లో గుడ్ల శ్రీనివాస్‌, 17లో గుండ్లపల్లి నీరజపూర్ణచందర్‌, 21లో ఎలుక వెంకటేశం, 24లో బుర్ర మల్లికార్జున్‌, 27లో కాసర్ల పద్మ, 28లో అడిచెర్ల రూపాసాయికృష్ణ, 29లో గెంట్యాల శ్యామలశ్రీనివాస్‌, 30లో మంచె రేణుకశ్రీనివాస్‌, 32లో సయ్యద్‌ అక్రమ్‌, 35లో బత్తుల రమేశ్‌, 36లో కల్లూరి రేణుకారాజు, 39వ వార్డులో ఆకుల స్వప్నకృష్ణ(చిన్న)ల పేర్లను ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement