మహా యాగానికి రండి | - | Sakshi
Sakshi News home page

మహా యాగానికి రండి

Jan 28 2026 6:49 AM | Updated on Jan 28 2026 6:49 AM

మహా య

మహా యాగానికి రండి

మహా యాగానికి రండి గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని లింగన్నపేట హరిహర ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు శతచండీ పునశ్చరణ పూర్వక అతిరుద్ర మహాయాగం నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వాహకుడు రాధాకృష్ణశర్మ మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, విప్‌ ఆది శ్రీనివాస్‌కు ఆహ్వానపత్రిక అందించారు. హామీలిచ్చి మరిచిన కాంగ్రెస్‌ సిరిసిల్లటౌన్‌: అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ సర్కారు అమలు చేయడంలో ప్రజలకు చేయిచ్చిందని టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని 17వ వార్డులో మున్సిపల్‌ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ సర్కారుకు చావుదెబ్బ ఖాయమన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి తుల ఉమ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకుడు చీటీ నర్సింగరావు, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ కౌన్సిలర్‌ గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్‌ పాల్గొన్నారు. ఉద్యోగం వదిలి.. పోటీకి కదిలి..

ఐదురోజుల పని దినాలు అమలు చేయాలి

సిరిసిల్ల/సిరిసిల్లటౌన్‌: వారంలో ఐదురోజుల పనిదినాలు అమలు చేయాలని జిల్లాలో బ్యాంకర్లు ఒక్క రోజు సమ్మెకు దిగారు. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు సిరిసిల్ల ఎస్‌బీఐ ఎదుట, గాంధీచౌక్‌లో బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ, ఆర్‌బీఐ, ఎల్‌ఐసీ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఇన్సూరెన్స్‌ సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ తదితర ఆర్థిక నియంత్రణ సంస్థలు ఇప్పటికే ఐదురోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నాయన్నారు. 2024 మార్చి 8న కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ) వారానికి ఐదురోజుల పని విధానం సిఫార్సు చేస్తూ, అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించా లని సూచించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఒప్పందం అమలుకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకు యూ నియన్‌ ప్రతినిధులు మనోహర్‌, శ్రీధర్‌, బాబు రాజ్‌, పవన్‌కల్యాణ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సీపీఆర్‌పై అవగాహన

సిరిసిల్ల: సీపీఆర్‌ (కార్డియోపల్మోనరీ రిసస్కిటేషన్‌)పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అడిషనల్‌ డీఎంఈ డాక్టర్‌ రాజేశ్వరి అన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో మంగళవారం సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించారు. మెడికల్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ నాగార్జున చక్రవర్తి, అసిస్టెంట్‌ డైరెక్టర్లు అబ్దుల్‌ ఖాదర్‌ పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: మున్సిపల్‌ బరిలో నిలిచేందుకు తన ఉద్యోగానికి బల్దియా శానిటేషన్‌ వర్కర్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన గడ్డం విజయ చాలా ఏళ్లుగా సిరిసిల్ల మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో శానిటేషన్‌ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి మంగళవారం తన ఉద్యోగానికి రాజీనామా చేసి పత్రాన్ని కమిషనర్‌ ఎంఏ ఖాదీర్‌పాషాకు అందజేశారు. సిరిసిల్ల 15వ వార్డు జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా, ఇక్కడ పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆమె వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్‌, కోడం రమణ తదితరులున్నారు.

మహా యాగానికి రండి1
1/4

మహా యాగానికి రండి

మహా యాగానికి రండి2
2/4

మహా యాగానికి రండి

మహా యాగానికి రండి3
3/4

మహా యాగానికి రండి

మహా యాగానికి రండి4
4/4

మహా యాగానికి రండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement