రన్‌ ఫర్‌ రోడ్‌ సేఫ్టీ | - | Sakshi
Sakshi News home page

రన్‌ ఫర్‌ రోడ్‌ సేఫ్టీ

Jan 25 2026 7:57 AM | Updated on Jan 25 2026 7:57 AM

రన్‌

రన్‌ ఫర్‌ రోడ్‌ సేఫ్టీ

సిరిసిల్ల/వేములవాడ: ట్రాఫిక్‌రూల్స్‌ పాటించడం సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వేములవాడలో అరైవ్‌.. అలైవ్‌.. అలెర్ట్‌.. రన్‌ ఫర్‌ రోడ్‌ సేఫ్టీ 2కే వాకథాన్‌ నిర్వహించారు. నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌ కార్యక్రమం అమలును విప్‌ అభినందించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, ఎస్పీ మహేశ్‌ బీ గీతే, ఏఎస్పీ రుత్విక్‌సాయి, అడిషనల్‌ ఎస్పీ చంద్రయ్య, సీఐలు వీరప్రసాద్‌, శ్రీనివాస్‌, జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

సిరిసిల్లలో..

జిల్లా కేంద్రంలో నిర్వహించిన అరైవ్‌..అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ మహేశ్‌ బీ గీతే మాట్లాడుతూ వాహనదారులు సామాజిక బాధ్యతగా భావించినప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఈ సందర్భంగా పలు వాహనాలకు రోడ్‌ సేఫ్టీ అవగాహన పోస్టర్లు అతికించారు. సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి, సిరిసిల్ల టౌన్‌ సీఐ కె.కృష్ణ, ఆర్‌ఎస్సై సురేశ్‌, ట్రాఫిక్‌ ఆర్‌ఎస్సై దిలీప్‌, నేతాజీ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

రన్‌ ఫర్‌ రోడ్‌ సేఫ్టీ1
1/1

రన్‌ ఫర్‌ రోడ్‌ సేఫ్టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement