ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

Jan 26 2026 6:41 AM | Updated on Jan 26 2026 6:41 AM

ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

డీసీసీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌

ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసిన మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం చట్టం పునరుద్ధరించాలని, వీబీజీ రామ్‌జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం గుండారం, రాచర్లగొల్లపల్లి, గంభీరావుపేట, సముద్రలింగాపూర్‌లలో ఆదివారం నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగులు, నిరుపేదలు ఇతర ప్రాంతాలకు వలస పోకుండా నిరోధించడానికి యూపీఏ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆ పథకాన్ని రద్దు చేసేందుకే పేరు మార్చిందన్నారు. కాంట్రాక్టర్లకు లాభం చేసేందుకే వీబీజీ రామ్‌జీ చట్టాన్ని తెచ్చిందని విమర్శించారు. పార్టీ మండలాల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, హమీద్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, బొప్పాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సాబేరబేగం, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సాహెబ్‌, జిల్లా కిసాన్‌ మోర్చా ఉపాధ్యక్షుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి, షేక్‌ గౌస్‌, కొమిరిశెట్టి తిరుపతి, పర్శ హన్మండ్లు, ఎర్ర నర్సయ్య, బాలయ్య, తిరుపతిగౌడ్‌, భూదయ్య, మహేశ్‌యాదవ్‌, భాస్కర్‌నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement