మున్సిపల్‌ ఖజానా గలగల | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఖజానా గలగల

Feb 2 2026 7:15 AM | Updated on Feb 2 2026 7:15 AM

మున్సిపల్‌ ఖజానా గలగల

మున్సిపల్‌ ఖజానా గలగల

● సిరిసిల్లలో రూ.31.02 లక్షలు ● వేములవాడలో రూ.6.15 లక్షలు వసూలు

● సిరిసిల్లలో రూ.31.02 లక్షలు ● వేములవాడలో రూ.6.15 లక్షలు వసూలు

సిరిసిల్ల: ఆస్తిపన్ను.. నల్లా పన్నులు చెల్లించాలని మున్సిపల్‌ సిబ్బంది ఇంటి చుట్టూ తిరిగినా వసూలు కాని రోజులు చూశాం. కానీ మున్సిపల్‌ ఎన్నికలు రావడంతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో బకాయి పన్నులు వసూళ్లు అయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి నామినేషన్‌ను ప్రతిపాదించే వ్యక్తులకు సంబంధించిన పన్నులు బకాయి ఉండొద్దనే నిబంధనలు ఉన్నాయి. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా మున్సిపల్‌ నుంచి నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సిరిసిల్ల మున్సిపాలిటీలోని 39 వార్డులకు నామినేషన్లు వేసిన 240 మంది అభ్యర్థులు మరో 240 మంది ప్రతిపాదించే వ్యక్తులు 880 మంది ఇంటి పన్నులను, నల్లా పన్నులను చెల్లించారు. దీంతో సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో ఆస్తిపన్నులు రూ.14 లక్షలు, నల్లాపన్నులు రూ.16లక్షలు, ఇతర పన్నులు రూ.లక్ష వసూలైంది. వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని 28 వార్డుల్లో నామినేషన్‌ వేసిన 150 మంది అభ్యర్థులతోపాటు మరో 150 మంది ప్రతిపాదించే వ్యక్తులు మొత్తం 300 మంది తమ ఇంటి పన్నులను చెల్లించారు. ఇంటి పన్నుల రూపంలో రూ.3.83 లక్షలు వసూలు కాగా.. నో డ్యూస్‌ సర్టిఫికెట్ల జారీకి రూ.2.32 లక్షలు వసూలయ్యాయి. వేములవాడ మున్సిపల్‌ పరిధిలో రూ.6.15 లక్షల మేరకు పన్నులు చెల్లించారు. వేములవాడ మున్సిపాలిటీలో నల్లా పన్నులను వసూలు చేయలేదు. ఫలితంగా కొంత మేరకు తక్కువ పన్నులు వసూలయ్యాయి. వాస్తవానికి ఎన్నికల నిబంధనల్లో నల్లా పన్నులు చెల్లించాలనే నిబంధన లేదు. కానీ సిరిసిల్ల మున్సిపల్‌ అధికారులు నో డ్యూస్‌ ఇచ్చేందుకు నల్లా బకాయిలు చెల్లించాలనే నిబంధనను విధించడంతో నల్లాల బకాయిలకు మోక్షం లభించింది. వేములవాడలో నిబంధనల మేరకు ఆస్తి పన్నులను మాత్రమే వసూలు చేశారు. ఎన్నికలు లేకుంటే 2026 మార్చి నెలాఖరులోగా ఇంటి చుట్టూ బిల్‌ కలెక్టర్లు తిరిగితే చెల్లించే పన్నులు ఎన్నికల పుణ్యమానీ ముందే వసూలు కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement