ముస్కానిపేటలో పట్టపగలే చోరీ | - | Sakshi
Sakshi News home page

ముస్కానిపేటలో పట్టపగలే చోరీ

Jan 26 2026 6:41 AM | Updated on Jan 26 2026 6:41 AM

ముస్కానిపేటలో పట్టపగలే చోరీ

ముస్కానిపేటలో పట్టపగలే చోరీ

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలోని ముస్కాన్‌పేటలో శనివారం పట్టపగలే ఓ ఇంటిలో చోరీ జరిగింది. చోరీ జరిగిన ఇంటి కుటుంబ సభ్యులు, ఎస్సై అశోక్‌ తెలిపిన వివరాలు. ఇల్లంతకుంట మండలం ముస్కానిపేటలోని దాసరి రాజయ్య భార్య రాజేశ్వరీ శనివారం ఇంటికి తాళం వేసి కూలి పనికి వెళ్లారు. పని ముగించుకొని తిరిగి ఇంటికొచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో పెట్టిన రెండు తులాల నెక్లెస్‌, ఒక తులం బంగారం చైన్‌, రూ.50వేలు నగదు, రెండు తులాల వెండి, దొంగలు ఎత్తుకెళ్లినట్టు తెలిపారు. సంఘటన స్థలంలో క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌, ఫింగర్‌ ప్రింట్స్‌ సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement