వరద కష్టాలు తీర్చాలి | - | Sakshi
Sakshi News home page

వరద కష్టాలు తీర్చాలి

Feb 5 2026 7:42 AM | Updated on Feb 5 2026 7:42 AM

వరద క

వరద కష్టాలు తీర్చాలి

వరద కష్టాలు తీర్చాలి సీసీ కెమెరాలు పెట్టించాలి పెద్ద మోరీలు కట్టించాలి

ఏటా వర్షాకాలంలో మేము వరదలతో ఇబ్బంది పడుతున్నాం. పై భాగంలోని నీళ్ళు వచ్చి ఇక్కడ నిలుస్తున్నాయి. ఇండ్ల బేస్మెంట్‌ భాగం పాడవుతున్నాయి. గోడలు పర్రెలు వస్తున్నవి. దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నాయి. వరదలు రాకుండా తాత్కాలికంగా కచ్చా నాలా తవ్వి వదిలేశారు. శాశ్వత పరిష్కారం చూపాలి.

– కందాళ నవీన్‌కుమార్‌, 2వ వార్డు

వార్డులో సీసీ కెమెరాలు పెట్టించాలి. కొన్ని ఏరియాల్లో వీధిలైట్లు లేవు. కొత్తగా వెలుస్తున్న కాలనీల్లో వసతులు కల్పించాలి. పాడైన పాతరోడ్ల స్థానంలో కొత్తగా నిర్మించాలి. మిషన్‌ భగీరథ నీరును అందరికీ సరిపడా సరఫరా చేయాలి. గీతానగర్‌ చౌరస్తా నుంచి పాతపోచమ్మ వరకు రోడ్డు వేయాలి.

– గండ్ర పృథ్వీథర్‌రావు, 3వ వార్డు

వార్డులో చిన్న మోరీలతో మురికినీరు సరిగా పోతలేదు. పెద్దమోరీలు కట్టించాలి. పాడైన రోడ్లను మరమ్మతు చేపట్టాలి. కొన్ని వాడల్లో లైట్లు వెలుగుతలేవు. ప్రతి రోజు మోరీలు శుభ్రం చేయించాలి. రోజు నల్లానీళ్లు ఎక్కువ సేపు ఇవ్వాలి. సీసీ కెమెరాలు పెట్టించి వార్డులో దొంగతనాలు జరక్కుండా చూడాలి.

– గున్నాల మల్లమ్మ, 4వ వార్డు

వరద కష్టాలు తీర్చాలి
1
1/2

వరద కష్టాలు తీర్చాలి

వరద కష్టాలు తీర్చాలి
2
2/2

వరద కష్టాలు తీర్చాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement