బండ్ల ప్రదక్షిణ | - | Sakshi
Sakshi News home page

బండ్ల ప్రదక్షిణ

May 2 2026 11:43 AM | Updated on May 2 2026 11:43 AM

ఇల్లంతకుంట: రేపాకలో శుక్రవారం సాయంత్రం మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా బండ్ల ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. ఆలయం చుట్టూ ఎడ్లబండ్లు, మేకపోతుల బండి, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు ప్రదక్షిణ చేయించారు. ప్రతి ఏటా జాతర నిర్వహిస్తామని సర్పంచ్‌ కాత మల్లేశం తెలిపారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జాతరలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తాళళ్లపల్లి సర్పంచ్‌ కనకరాజు, ముస్కాన్‌పేట సర్పంచ్‌ భాస్కర్‌రెడ్డి, ఇల్లంతకుంట సర్పంచ్‌ రాజు, కాంగ్రెస్‌ నాయకుడు రాజయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement