యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

● బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు

చందుర్తి(వేములవాడ): యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజక వర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. కేసీఆర్‌ క్రికెట్‌ కప్‌ టోర్నమెంటులో పాల్గొన్న మండలంలోని 10 జట్లు, రుద్రంగి మండలం 5 జట్లకు ఆదివారం మండలకేంద్రంలోని పెరుక కమ్యూనిటీ హాల్‌లో క్రికెట్‌ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, తిరుపతి, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, రుద్రంగి మాజీ ఎంపీపీ గంగం స్వరూపరాణి, కేడీసీసీ డైరెక్టర్‌ జలగం కిషన్‌రావు, చందుర్తి సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు తిప్పని శ్రీనివాస్‌, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు ఏనుగుల శ్రీనివాస్‌, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement