● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జనగణన–2027లో భాగంగా స్వీయ గణన నమోదులో భాగస్వాములు కావా లని కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరీమా అగ్రవాల్ కోరారు. ఆదివారంతో స్వీయ గణన నమోదు ముగియనుందని తెలిపారు. స్వీయ గణనకు https:iise.census.gov.in వెబ్‌సైట్ ద్వారా లాగిన్ కావాలని సూచించారు. ప్రజల సమాచారం పూర్తిభద్రంగా ఉంటుందని వెల్లడించారు. 34 ప్రశ్నలకు సరైన సమాచారం నమోదు చేసి ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్‌నంబర్ 1855లో సంప్రదించాలని సూచించారు.
నేడు జిల్లా కేంద్రంలో మారథాన్
జనగణన–2027 తొలి దశపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం ఉదయం 7 గంటలకు సిరిసిల్లలోని అంబేడ్కర్ కూడలి నుంచి బతుకమ్మ ఘాట్ వరకు మారథాన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
లాడ్జీల్లో పక్కా సమాచారం ఉండాలి
వేములవాడ: లాడ్జీలలో పక్కా సమాచారం ఉండాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరికీ గదులు అద్దెకు ఇవ్వరాదని డీఎస్పీ శ్రీనివాసులు లాడ్జీ నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం రాత్రి టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సై రాంమోహన్‌తో కలిసి లాడ్జీలను తనిఖీ చేశారు. లాడ్జీలలో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


