రైతులు సుభిక్షంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

రైతులు సుభిక్షంగా ఉండాలి

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

● బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

● బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట/వీర్నపల్లి: వర్షాలు సమృద్ధిగా కురిసి ఈ ప్రాంత రైతులు సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో మల్లికార్జునస్వామి, దుమాలలోని శ్రీవేంకటేశ్వరస్వామి, వీర్నపల్లిలోని శ్రీజగదాంబమాత, సేవాలాల్‌ మహారాజ్‌ విగ్రహ ప్రతిష్ఠ, గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ ముత్యాల పోచమ్మ దేవి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. దుమాలలో ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ ద్వారా రూ.50లక్షలు కేటీఆర్‌ మంజూరు చేయించారు. టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, సింగిల్‌ విండో చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీలు ఎలుసాని మోహన్‌కుమార్‌, సుజాత, మాజీ ఏఎంసీ చైర్మన్‌ గుల్లపల్లి నరసింహారెడ్డి, సర్పంచ్‌లు సోమారం శరవింద్‌, పిట్ల ఎల్లయ్య, దయాకర్‌రావు, లక్ష్మణ్‌, అంజయ్య, కిష్టయ్య, దుబాసి రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement