‘పది’ విద్యార్థులకు 15వేల సైకిళ్లిస్తా | - | Sakshi
Sakshi News home page

‘పది’ విద్యార్థులకు 15వేల సైకిళ్లిస్తా

May 8 2026 1:13 PM | Updated on May 8 2026 1:13 PM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

సిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ఈ ఏడాది కూడా 15వేల సైకిళ్లు అందిస్తానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌మార్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సినారె కళామందిరంలో గురువారం ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ సీఎస్‌ఆర్‌ కింద దివ్యాంగులకు రూ.83 లక్షల విలువైన 813 ఉపకరణాలు పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ భవిష్యత్‌లో అర్హులైన దివ్యాంగులకురి ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఎంతో మంది దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. దివ్యాంగులకు అందరూ మద్దతుగా ఉండాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలని, డ్రాపౌట్స్‌ ఉండవద్దని తెలిపారు. దివ్యాంగులు సంక్షేమానికి కృషి చేస్తున్న కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో యూడీఐడీ కేంద్రంలో అన్ని వసతులు కల్పించామని, వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రతి నెలా చేయిస్తున్నామని వివరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వినికిడి యంత్రాలు, బ్యాటరీ సైకి ల్స్‌, సుగమ్య కేన్‌, స్మార్ట్‌ ఫోన్‌, ఇతర పరికరాలు అందజేశారు. ఎస్పీ మహేశ్‌ బీ గీతే, మార్కెట్‌ కమి టీ చైర్‌పర్సన్‌ స్వరూపారాణి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఐఓసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వినీత్‌కౌల్‌, సీఎస్‌ ఆర్‌ హెడ్‌ హైదరాబాద్‌ కై లాస్‌కాంత్‌, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

మోదీ సభకు భారీగా తరలిరండి

సిరిసిల్ల: ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 10న హైదరాబాద్‌ రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించే బహిరంగసభకు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కోరారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌కే కన్వెన్షన్‌ హాల్‌లో గురువారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆపరేషన్‌ సింధూర్‌ తరువాత ప్రధాని తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారని.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. సభకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్న వారికి తగిన రవాణా, భోజన సౌకర్యాలు కల్పించాలన్నారు. మోదీ సభ సక్సెస్‌తో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం తథ్యమనే సంకేతాలు పంపుదామని స్పష్టం చేశారు. ఈనెల 12న హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్‌లో నిర్వహించే హిందూ ఏక్తాయాత్రకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చెన్నమనేని వికాస్‌రావు, పార్టీ నాయకులు అల్లాడి రమేశ్‌, ఎర్రం మహేశ్‌, గరిపెల్లి ప్రభాకర్‌, బండ మల్లేశం, దుమాల శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement