ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం
వేములవాడ: సమష్టిగా పనిచేసి ప్రజల మన్ననలు పొంది విజయవంతం కావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికలో పాల్గొన్నారు. కమిషనర్ సంపత్‌రెడ్డి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. కో–ఆప్షన్ సభ్యులుగా కట్కూరి శ్రీనివాస్, ఫీర్ మహమ్మద్, దుర్గం విజయపర్శరాము, తుమ్మ జ్యోతిలను ఎన్నుకున్నారు. కమిషనర్ సంపత్‌రెడ్డి ఎన్నిక సర్టిఫికెట్ అందించడంతోపాటు ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో వేములవాడ మున్సి పాలిటీలో ఉన్న నాలుగు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయింది.
కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు
పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికై న కోఆప్షన్ సభ్యులను సన్మానించిన సందర్భంగా మాట్లాడారు. నూతనంగా ఎన్నికై న నలుగురు సభ్యులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ ఎదుట పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.


