పొద్దుతిరుగుడు కొనాలి | - | Sakshi
Sakshi News home page

పొద్దుతిరుగుడు కొనాలి

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

ఇల్లంతకుంట(మానకొండూర్‌): పొద్దు తిరుగుడు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని, వెంటనే కొనాలని కోరుతూ రైతులు సోమవారం ధర్నా చేపట్టారు. తహసీల్దార్‌ సురేష్‌, ఎస్సై అశోక్‌ అక్కడికి చే రుకొని రైతులతో మాట్లాడారు. ఫోన్‌లో మార్క్‌ఫెడ్‌ డీఎంతో తహసీల్దార్‌ మాట్లాడగా.. కొనుగోలు చేసేందుకు దరఖాస్తు చేశామని.. అనుమతులు రాగానే కొంటామనడంతో రైతులు ధర్నా విరమించారు. రెండు రోజుల్లో కొనుగోలు చేయకపోతే నిరాహార దీక్షకు కూర్చుంటామని రైతులు హెచ్చరించారు. పత్తికుంటపల్లి సర్పంచ్‌ జుట్టు శేఖర్‌, మాజీ సర్పంచ్‌ చింతలపల్లి రవీందర్‌రెడ్డి, గుమ్ముటాల నరసింహారెడ్డి, రైతులు చింతలపెల్లి రాజిరెడ్డి, బోడ రమణారెడ్డి, చింతలపల్లి శ్రీనివాసరెడ్డి, భారతవ్వ, సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement