పూడికతీతతో నీటినిల్వల పెంపు | - | Sakshi
Sakshi News home page

పూడికతీతతో నీటినిల్వల పెంపు

May 16 2026 4:53 AM | Updated on May 16 2026 4:53 AM

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అటవీ ప్రాంతంలో చేపట్టిన పూడికతీత పనులతో నీటి నిల్వలు పెంపొందుతాయని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మండలంలోని పదిరలో చేపట్టిన ఉపాధిహామీ పనులను శుక్రవారం పరిశీలించారు. పనులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చెక్‌డ్యాములు, నీటికుంటలు ఇతర ప్రాంతాల్లో పూడికతీత పనులు సాగుతున్నాయన్నారు. ఏపీడీ నర్సింలు, అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి మోహన్‌లాల్‌, ఎంపీడీవో సత్తయ్య, ఏపీవో కొమురయ్య, కార్యదర్శి అనూష పాల్గొన్నారు.

కనీస వేతనాలు అమలు చేయాలి

సిరిసిల్లటౌన్‌: ప్రీ ప్రైమరీ టీచర్స్‌కు, ఆయాలకు కనీస వేతనాలు అందించాలని ప్రీ ప్రైమరీ టీచర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ప్రీ ప్రైమరీ టీచర్స్‌, ఆయా యూనియన్‌ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. లక్ష్మణ్‌ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ టీచర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నాయకులు కూర రాకేశ్‌, మంత్రి లావణ్య, నిషాని మాధవి, స్వప్న, గిరిజ, అంజలి, శాంత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement