సిరిసిల్ల: ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యాశాఖ విజయోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సమ్మర్ క్యాంపులు ప్రారంభించి, 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. గురుకులాలు, హాస్టళ్లలో మెనూ నాణ్యమైన భోజనం అందిస్తూ.. కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచామన్నారు. 10వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, స్కిల్ యూనివర్సిటీ, అడ్వా న్స్‌డ్స్ టెక్నాలజీ సెంటర్లు మంజూరు చేసినట్లు వివరించారు. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పదో తరగతి, ఇంటర్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. తక్కువ సెలవులు తీసుకున్న టీచర్లను సన్మానించారు. ఏఎంసీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూపారెడ్డి, డీఈవో జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
యువజన, క్రీడా వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
ఈనెల 18 నుంచి 23 వరకు నిర్వహించే యువజన క్రీడా వారోత్సవాల పోస్టర్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆవిష్కరించారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు అంబేడ్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2కే రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 23న సిరిసిల్ల కే–కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే జాబ్‌మేళా పోస్టర్లు ఆవిష్కరించారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


