ఇరుక్కుపోతున్నారు! | - | Sakshi
Sakshi News home page

ఇరుక్కుపోతున్నారు!

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

● నిబంధనలకు తూట్లు.. జనం పాట్లు ● నిర్వహణ లేక గాలిలో ప్రాణాలు ● అసెంబుల్డ్‌ కంపెనీలతో అవస్థలు

సిరిసిల్ల: జిల్లాలోని పలు ఆస్పత్రులు.. షాపింగ్‌మా ల్స్‌.. అపార్ట్‌మెంట్లలో లిఫ్ట్‌ల నిర్వహణ సరిగా లేదు. సామాన్యులు ఏదో ఒక చోట ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఒక పోలీసాఫీసర్‌ గతంలో లిఫ్ట్‌లో నుంచి కిందపడి మరణించిన ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. రెండు రోజుల క్రితం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రయాణించే లిఫ్ట్‌ ప్రమాదానికి గురైన సంఘటన మళ్లీ లిఫ్ట్‌ల నిర్వహణ, భద్రతపై చర్చకు తెరలేపింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని లిఫ్ట్‌లపై ప్రత్యేక కథనం.

నిబంధనలకు తూట్లు

భవన నిర్మాణ సమయంలో లిఫ్ట్‌ ఏర్పాటుకు అవసరమైన నిర్మాణాలు చేయాల్సి ఉండగా.. నిర్మాణ దారులు పట్టించుకోవడం లేదు. గాలి, వెలుతురు ఉండేలాప్రత్యేక స్థలాన్ని విడిచిపెట్టకుండా ఇరుకుగా నిర్మిస్తున్నారు. భవన నిర్మాణ సమయంలో నిబంధనలు పాటించకుండా.. పనులు పూర్తి చేసి ఆ తరువాత లిఫ్ట్‌లు పెట్టడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. బ్రాండెడ్‌ కంపెనీల లిఫ్ట్‌లు కాకుండా.. సిద్దిపేటకు చెందిన అసెంబుల్డ్‌ లిఫ్ట్‌లను నిర్మాణదారులు బిగిస్తుండడంతో తక్కువ ఖరీదుకే పూర్తవుతున్నాయి. ఆ లిఫ్ట్‌లకు వినియోగించే మోటారు, తాడు, చక్రం, ఇతర సామగ్రి నాణ్యతలో తేడా ఉండడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

నిర్వహణ లోపాలు

లిఫ్ట్‌ ఏర్పాటు చేసుకున్న భవన యజమానులు ఏటా నిర్వహణపరమైన మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఏటా లిఫ్ట్‌ కంపెనీ ప్రతినిధులు వచ్చి దాని పనితీరును పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేసి యాన్యువల్‌ మెయింటనెన్స్‌ సర్టిఫికెట్‌ (ఏఎంసీ) ఇవ్వాలి. కానీ చాలా ఆస్పత్రుల నిర్వాహకులు, భవన నిర్మాణదారులు ఏఎంసీ చేయించడం లేదు. దీంతో లిఫ్ట్‌ నిర్వహణ లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ వంటి ప్రాంతాలతోపాటు ఖరీదైన బ హుళ అంతస్తుల భవనాలు నిర్మించే వారు లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కానీ దాని నిర్వహణను ప ట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతుంది. జిల్లా వ్యాప్తంగా 150కి పైగా లిఫ్ట్‌లు ఉన్నా యి. ఇందులో కొన్ని ప్రముఖ కంపెనీలవి ఉండగా.. చాలా వరకు స్థానికంగా త యారు చేసిన అ సెంబుల్డ్‌ లిఫ్ట్‌లు ఉండడం గమనార్హం.

పట్టించుకోని అధికారులు

జిల్లాలో క్షేత్రస్థాయిలో లిఫ్ట్‌ల నిర్వహణను పర్యవేక్షించాల్సిన మున్సిపల్‌, గ్రామపంచాయతీల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజల ప్రాణాల రక్షణ గాలిలో దీపంలా మారింది. ఏటా నిర్వహించే లిఫ్ట్‌ల నిర్వహణను పర్యవేక్షిస్తూ.. ప్రత్యేకంగా ఓ వ్యక్తిని లిఫ్ట్‌ల వద్ద నియమించేలా నిబంధనలు అమలు చేస్తే.. ప్రమాదాలను కొంత మేరకై నా నివారించినట్లు అవుతుంది. ఇప్పటికై నా జిల్లా అధికారులు లిఫ్ట్‌ల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

సిరిసిల్ల పట్టణంలోని ఓ అపార్టుమెంట్‌లోని లిఫ్ట్‌లో నలుగురు ప్రయాణిస్తుండగా.. అకస్మాత్తుగా కరెంట్‌ పోయింది. ఆ లిఫ్ట్‌కు బ్యాకప్‌ బ్యాటరీ సిస్టమ్‌ లేకపోవడం, జనరేటర్‌ సౌకర్యం లేకపోవడంతో లిఫ్ట్‌లో ఉన్న నలుగురు అరగంట పాటు అందులోనే నరకయాతన అనుభవించారు. చివరికి కరెంట్‌ వచ్చిన తరువాత హమ్మయ్య అంటూ.. ఊపిరి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement