ఇసుక ట్రాక్టర్ల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్ల అడ్డగింత

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

ఇల్లంతకుంట(సిరిసిల్ల): మండలంలోని పొత్తూరు మానేరు వాగు రీచ్‌ నుంచి శుక్రవారం ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్లను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. పొత్తూరు మానేరువాగు నుంచి ఇసుకను ప్రైవేటు కంపెనీ కోసం ప్రొక్లెయిన్లతో తోడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా ఇసుక తరలించడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటి పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పొత్తూరు సమీపంలోని ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ సురేశ్‌, ఎస్సై సిరిసిల్ల అశోక్‌ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఇసుక తరలింపును అడ్డుకోవద్దని సూచించారు. మైనింగ్‌, ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఎస్సై–2 లక్పతి, రైతులు పట్నం శ్రీనివాస్‌, బండారి నరేశ్‌, మహేందర్‌, సతీశ్‌, కుదురు శేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement