ఎల్లమ్మ పట్నం
● కలెక్టర్ గరీమా అగ్రవాల్
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వెల్జీపురంలో ఎల్లమ్మ సిద్ధోగం బుధవారం నిర్వహించారు. మూడు రోజులుగా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలు పెద్దపట్నంతో ముగిశాయి.
సిరిసిల్ల: పిల్లలు లేని వారికి దత్తత వరమని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఇద్దరు చిన్నారులను దత్తతకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలను చక్కగా చూసుకోవాలని చెప్పారు. ఎవరైనా చట్టబద్ధంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో పిల్లలను దత్తతకు ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఇతర అక్రమ మార్గాలలో చేసుకుంటే ఐదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా ఉంటుందని హెచ్చరించారు. పిల్లలను పెంచే స్థోమత లేనటువంటి తల్లితండ్రులు తమ పిల్లల్ని దత్తత కోసం అప్పగించవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. పిల్లలను నిర్లక్ష్యం చేసినా, వదిలివేయడానికి ప్రోత్సహించిన వారికి కూడా చట్ట ప్రకారం జైలు, జరిమానా ఉంటుందని హెచ్చరించారు. ఎవరికై నా పిల్లలు పెంచే శక్తి లేనట్లయితే, అవాంచిత గర్భమైనప్పుడు వద్దు అనుకుంటే పిల్లలను ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రాలకు అప్పగించాలన్నారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా బాలల ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్‌ఐసీ ఎం.గగన్‌కుమార్ పాల్గొన్నారు.
ధాన్యానికి అనుగుణంగా లారీలు పెంచాలి
కోనరావుపేట(వేములవాడ): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి అనుగుణంగా లారీల సంఖ్యను పెంచాలని ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు. మండలంలోని మర్తనపేట, నాగారం గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. కొనుగోలుకు సంబంధించిన రిజిస్టర్లు తనిఖీ చేశారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ వరలక్ష్మి పాల్గొన్నారు.


