● అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్
ఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని కిష్టరావుపల్లి, కందికట్కూర్, వల్లంపట్ల కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. లారీల కొరత ఉన్నచోట ట్రాక్టర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. ఏపీఎం కుమారస్వామి, సీసీ రాజేశ్వరి, మండల సమాఖ్య అధ్యక్షురాలు కట్ట సౌమ్య పాల్గొన్నారు.
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: పాఠశాలల అభివృద్ధిలో, బడీడు పిల్లలను స్కూల్‌లో చేర్పించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా విద్యాధికారి డాక్టర్ బి.జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. సిరిసిల్ల నియోజకవర్గస్థాయి విద్యావారోత్సవాలు బుధవారం స్థానిక లహరి గ్రాండ్‌లో నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ రానున్న విద్యాసంవత్సరంలో ప్రతీ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు, అల్పాహారంలో మూడు రోజులు పాలు, మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అమలు చేయనున్నట్లు తెలిపారు. పదోతరగతి ఫలితాల్లో 96 శాతం విద్యార్థులు పాసయ్యారని, 250కి పైగా 550 పైగా మార్కులు సాధించారని తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో సీ.హెచ్.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, ఏఎంసీ చైర్‌పర్సన్‌లు వెలుముల స్వరూపారెడ్డి, గౌస్ బేగం, జీసీడీవో పద్మజ, ఎంఈవోలు దూస రఘుపతి, కృష్ణహరి, రాజిరెడ్డి, రాజు, గంగారం పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న లోపాయికారీ విధానాలతోనే నీట్ పేపర్ లీకై ందని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఆరోపించారు. నీట్‌పేపర్ రద్దు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం చేనేతన్న చౌక్‌లో ధర్నా చేపట్టారు. మట్టి శ్రీనివాస్, అరెల్లి వినయ్‌కుమార్, సదుల శేఖర్, ఎండీ అజ్జు, బల్యాల ప్రవీణ్, బైకని వేణుగోపాల్, లింగంపల్లి అబ్బి, పవన్, లక్ష్మణ్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లబొప్పాపూర్‌లో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధిస్తూ బుధవారం పాలకవర్గం తీర్మానించింది. ఎవరైనా నిషేధాన్ని ఉల్లంఘిస్తే జరిమానాలు విధించనున్నట్లు హెచ్చరించారు. గ్రామంలో జరిగే శుభకార్యాలకు గ్రామపంచాయతీ తరఫున స్టీల్‌ప్లేట్లు, గ్లాస్‌లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి, ఉపసర్పంచ్ కొండాపురం వెంకటరెడ్డి, కార్యదర్శి సంతోష్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు పేర్కొన్నారు. కళాశాలలో బుధవారం కాలేజీ ప్లానింగ్ డెవలప్‌మెంట్ కమిటీ, పూర్వ విద్యార్థుల కమిటీ సమావేశాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఉపసర్పంచ్ కమలాకర్‌రెడ్డి, ప్రిన్సి పాల్ విజయలక్ష్మి, సైకలాజిస్టు ప్రవీణ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ పాల్గొన్నారు.


