బండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు
సిరిసిల్లటౌన్: కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్‌కుమార్ హేయమైన భాషతో తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వ్యాఖ్యలు సిగ్గుచేటని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో గురువారం ప్రెస్‌మీట్లో మాట్లాడారు. కరీంనగర్‌లో కేంద్ర మంత్రి ఇంటికి కూతవేటు దూరంలో నగలషాపులో దొంగలు తుపాకులతో వచ్చి దోచుకెళ్లడంపై కేటీఆర్ విమర్శించడం ప్రతిపక్ష నేతగా బాధ్యత అని పేర్కొన్నారు. కరీంనగర్‌లో శాంతిభద్రతలు కాపాడాల్సింది పోయి అనుచరులు, గూండాలతో ఎమ్మెల్యే గంగుల క్యాంపు ఆఫీస్, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కారుపై దాడులు చేయించం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పేర్కొన్నారు. హేయమైన భాషను మాట్లాడకుండా ఉండటం నేర్చుకోవాలని హితవు పలికారు. కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హుందాగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఎస్‌పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, నాయకులు మ్యాన రవి, గుండ్లపెల్లి పూర్ణచందర్, కుంభాల మల్లారెడ్డి, నంది శంకర్ పాల్గొన్నారు.
ఫైర్ సిబ్బంది మాక్‌డ్రిల్
సిరిసిల్లటౌన్: జిల్లా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదాల నివారణపై గురువారం ఫైర్ సిబ్బంది అవగాహన కల్పించారు. ఫైర్ ఆఫీసర్ ఎన్.నరేందర్ మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై మాక్‌డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


