సెంట్రల్‌ బోర్డ్‌ ఫిలిం ప్యానల్‌ మెంబర్‌గా వైశాలి | - | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ బోర్డ్‌ ఫిలిం ప్యానల్‌ మెంబర్‌గా వైశాలి

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

బహిరంగ సభ విజయవంతం చేయాలి

సిరిసిల్లటౌన్‌: సెంట్రల్‌ బోర్డ్‌ ఫిలిం ప్యానల్‌ మెంబర్‌గా జిల్లా కేంద్రానికి చెందిన వేముల వైశాలి నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైశాలి మాట్లాడుతూ, తన నియామకంతో మరింత బాధ్యత పెరిగిందని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీకి, కేంద్ర మంత్రి సంజయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

సిరిసిల్లఅర్బన్‌: పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు అన్నారు. ఆదివారం పట్టణంలోని 12వ వార్డు చంద్రంపేట, 2వ వార్డు శాంతినగర్‌లో లబ్ధిదారులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరై నూతనవస్త్రాలు అందజేశారు. ఇందిరమ్మ పథకం ద్వారా అనేక మంది నిరాశ్రయులకు సొంతింటి కల సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, మడుపు శ్రీదేవి, కౌన్సిలర్‌ వెంగళ లీల, లక్ష్మీనారాయణ, సూర నిర్మల, నూనే శ్రీనివాస్‌, ఎల్లయ్య, శంకర్‌, పర్శరాములు, నర్సయ్య పాల్గొన్నారు.

సీడీఎంఏకు వేములవాడ కమిషనర్‌

వేములవాడ: వేములవాడ మున్సిపల్‌లో విధులు నిర్వహిస్తున్న కమిషనర్‌ సంపత్‌కుమార్‌ను సీడీఎంఏకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆయన బదిలీ కాస్త ఆగినట్లే ఆగి తిరిగి మళ్లీ బదిలీ కాక తప్పలేదు. సంపత్‌కుమార్‌ను రిలీవ్‌ చేసి సీడీఎంఏలో జాయిన్‌ కావాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో ఆయన హైదరాబాద్‌కు వెళ్లగా, అతడి స్థానంలో ఇన్‌చార్జి కమిషనర్‌గా మేనేజర్‌ సంపత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు సంపత్‌రెడ్డి శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. కాగా, మంచిర్యాలలో విధులు నిర్వహిస్తున్న కమిషనర్‌ అన్వేశ్‌ వేములవాడకు రావాల్సి ఉండగా అక్కడి ఎమ్యెల్యే అన్వేశ్‌ అక్కడే ఉండాలని కోరడంతో ఆయన బదిలీ ఆగిపోయిన విషయం తెలిసిందే.

సిరిసిల్లఅర్బన్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఈ నెల 10న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చే యాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పి లుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి రూ.7,800 కోట్లకు పైగా నిధులతో పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అనేక అడ్డంకులు పె ట్టిందన్నారు. రైతు సమస్యల విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ విఫలమయ్యాయని ఆరోపించారు. సభను విజయవంతం చేయాడానికి ప్రతీ కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. సభ రాష్ట్రానికి కీలక మలుపు కావాలని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్‌రావు, మీసాల చంద్రయ్య, జిల్లా ఇన్‌చార్జి గంగాడి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement