వేములవాడ: పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల పట్టణ ప్రగతి’ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులను మంగళవారం కమిషనర్ సంపత్‌రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. మూలవాగు సమీపంలోని పంప్‌హౌస్‌ను సందర్శించారు. నిరుపయోగంగా ఉన్న పంపులకు మరమ్మతు చేయించి, వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ గల్లీలో సమస్య్చ పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చైర్మన్ రాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే నిధులు సకాలంలో అందేలా చూడాలన్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మాలతి, హౌసింగ్ ఏఈ సౌజన్య, ఏఈ అనన్య, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.


