జాతీయస్థాయిలో మెరిసిన మల్లారం | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయిలో మెరిసిన మల్లారం

May 16 2026 4:53 AM | Updated on May 16 2026 4:53 AM

● డిజిటల్‌ విలేజీగా గుర్తింపు ● అభినందనల వెల్లువ

● డిజిటల్‌ విలేజీగా గుర్తింపు ● అభినందనల వెల్లువ

వేములవాడరూరల్‌: డిజిటల్‌ వ్యవసాయం.. గ్రామాభివృద్ధి.. పారదర్శకత విషయాల్లో వేములవాడరూరల్‌ మండలం మల్లారం గ్రామం మెరిసింది. ఏప్రిల్‌ నెలలో ప్రకటించిన జాబితాలో మల్లారం గ్రామానికి ప్రథమ స్థానం దక్కింది. డిజిటల్‌ వ్యవసాయం, గ్రామాభివృద్ధి, ప్రజాభాగస్వామ్యం, పారదర్శకత అనే నాలుగు అంశాలను సమన్వయం చేయడంలో గ్రామం మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవల గ్రామ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌లో గ్రామంలోని ప్రతీ సమస్య, అభివృద్ధి, ప్రభుత్వ పథకాలతో మరెన్నో సమాచారాలను సర్పంచ్‌ సంగెం అర్పిత కుమారుడు సంహిత్‌రెడ్డి రూపొందించారు. దీనిని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. వెబ్‌సైట్‌ ప్రారంభించడంతో మొదటి స్థానంలో ఉన్న మల్లారం జాతీయస్థాయిలో గుర్తింపు దక్కించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement