పట్టా లేని రైతుల వడ్లు నేరుగా మిల్లులకే | - | Sakshi
Sakshi News home page

పట్టా లేని రైతుల వడ్లు నేరుగా మిల్లులకే

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

● జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం

● జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం

వీర్నపల్లి(సిరిసిల్ల): పట్టాపత్రాలు లేని రైతుల ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం హామీ ఇచ్చారు. ‘పట్టాలిచ్చినా.. ఆన్‌లైన్‌ చిక్కులు’ శీర్షికన ‘సాక్షి’లో శనివా రం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండలంలోని రంగంపేటలోని కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయాధికారి, ఏఈవో ఫజిల్‌తో కలిసి పరిశీలించారు. ఐకేపీ సెంటర్‌లో పట్టా ఉన్న రైతుల ధాన్యాన్ని వెంటనే కాంటా పెట్టి మిల్లులకు పంపించాలని నిర్వాహకులకు సూచించారు. పట్టాలు లేని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నేరుగా రైస్‌మిల్లర్లతో మాట్లాడి పంపించే ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాములునాయక్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement