● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్
కోనరావుపేట(వేములవాడ): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పేర్కొన్నారు. మండలంలోని కొలనూర్, ధర్మారం గ్రామాల్లోని సింగిల్‌విండో కొనుగోలు కేంద్రాలను, కనగర్తిలోని మారుతి, కనకదుర్గ, కొలనూర్‌లోని సరస్వతి రైస్‌మిల్లులను శనివారం తనిఖీ చేశారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం, ట్యాబ్ ఎంట్రీపై ఆరా తీశారు. సరిపడా హమాలీలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్ చేసుకోవాలన్నారు. అనంతరం కోనరావుపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంకు వెళ్లే దారిలో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు.


