విద్యుత్‌లైన్లను సరిచేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌లైన్లను సరిచేయాలి

May 14 2026 10:47 AM | Updated on May 14 2026 10:47 AM

● ఎన్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌

● ఎన్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌

సిరిసిల్ల: జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ లైన్లను సరిచేయాలని ఎన్పీడీసీఎల్‌ డైరెక్టర్‌(ఆపరేషన్‌) టి.మధుసూదన్‌ కోరారు. సిరిసిల్ల విద్యుత్‌ సర్కిల్‌ ఆఫీస్‌లో బుధవారం అధికారులతో సమీక్షించారు. మధుసూదన్‌ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న కొత్త విద్యుత్‌ లైన్ల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, వినియోగదారులకు కొత్త విద్యుత్‌ సర్వీసెస్‌ రిలీజింగ్‌ చేయాలన్నారు. విద్యుత్‌ పంపిణీలో లోపాలు గుర్తించి, సవరించాలన్నారు. వరంగల్‌ జోనల్‌ సీఈ బుస్సా అశోక్‌, జిల్లా సర్కిల్‌ ఎస్‌ఈ టి.వేణుమాధవ్‌, డీఈఈలు ఎన్‌.అంజయ్య, వెంకటరమణ పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు చేయండి

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ మండలంలోని పొత్తూరులో రైతులు బుధవారం రోడ్డుపై బైఠాయించారు. తహసీల్దార్‌ సురేష్‌ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రోజుకు నాలుగు లారీలు పంపిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. పట్నం శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ బండారి నరేశ్‌, రైతులు తోడేటి సతీశ్‌, బండారి మౌనిక, మమత, నవీన్‌కుమార్‌, దయ్యాల చంద్రమౌళి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement