● ఎస్పీ మహేశ్ బీ గీతే
కోనరావుపేట(వేములవాడ): గ్రామాల్లో దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలన్నారు. తరచూ గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్‌నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం ధర్మారంలోని కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడారు. కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఎదురైనా స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. చందుర్తి సీఐ రవీందర్, కోనరావుపేట ఎస్సై ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు.
పశువుల అక్రమ రవాణాపై
సమాచారం ఇవ్వండి
పశువుల అక్రమ రవాణా నేరమని దానికి సంబంధించిన సమాచారాన్ని పోలీస్‌శాఖకు అందించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో హిందూ సంఘాల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో హెల్ప్‌లైన్ 87125 37826ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ నోడల్ అధికారి 87126 56410లో సమాచారం ఇవ్వాలని సూచించారు. సీజ్ చేసిన పశువుల కోసం జిల్లాలో 9 ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐ రవి, ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు.


