● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: డ్రగ్స్‌ను నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్‌ను అందించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో క్రీడాకారులు యువకులు విద్యార్థులతో కలిసి 2కే రన్ నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి విద్యార్థి, యువకుడు ‘యాంటీ డ్రగ్ సోల్జర్’గా మారి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని కోరారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో హెల్ప్‌లైన్ నంబర్ 87126 71111కు, సమీప పోలీస్ స్టేషన్‌కు అందించాలని సూచించారు. ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, యువతతో డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్‌ఐలు శ్రీకాంత్, డీసీపీఓ కవిత పాల్గొన్నారు.


