తడిసిన ధాన్యం కొనాలి | - | Sakshi
Sakshi News home page

తడిసిన ధాన్యం కొనాలి

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

రుద్రంగి(వేములవాడ): అకాల వర్షాలతో ధన్యాం తడిసి ముద్దవుతుందని.. ఇప్పటికై నా కొనుగోలు చేయాలని కోరుతూ రుద్రంగిలో రైతులు ఆదివారం ధర్నాకు దిగారు. వీరికి బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతుగా నిరసన తెలిపారు. కొనుగోళ్లలో జాప్యమవుతుందన్నారు. ధాన్యం ఎప్పుడు కొంటారో అధికారులు తెలపాలని కోరారు. తేమశాతం వచ్చినా కొనడం లేదన్నారు. తాతమ్మగుడి దగ్గరలోని కొనుగోలు కేంద్రంలోకి లారీలు రావడం లేదన్నారు. ఇప్పటి వరకు 4వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొన్నారని, ఇంకా 30వేల క్వింటాళ్ల ధాన్యం అలాగే ఉందన్నారు. విషయం తెలుసుకున్న రుద్రంగి తహసీల్దార్‌ పుష్పలత, ఎస్సై మోతిరాంనాయక్‌ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. త్వరగా తూకం వేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. సెస్‌ డైరెక్టర్‌ ఆకుల గంగారాం, నాయకులు దయ్యాల కమలాకర్‌, మంచె రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement