అచ్చయ్యకుంటకు ఎల్లంపల్లి నీరు | - | Sakshi
Sakshi News home page

అచ్చయ్యకుంటకు ఎల్లంపల్లి నీరు

May 1 2026 7:56 AM | Updated on May 1 2026 7:56 AM

రుద్రంగి(వేములవాడ): రుద్రంగిలో తాగునీటి కొరత రాకుండా విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు నాగారం చెరువు, అచ్చయ్యకుంటకు ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు, సర్పంచ్‌ గండి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్‌ చెలుకల తిరుపతి పేర్కొన్నారు. అచ్చయ్య కుంటకు నీరు తరలించే ఎల్లంపల్లి కాలువను గురువారం పరిశీలించారు. ఎండిపోతున్న పంట పొలాలకు మూడుసార్లు, ఇప్పుడు తాగునీటి కోసం మందుచూపుతో ఎల్లంపల్లి నీటిని విడుదల చేయిస్తున్న విప్‌ ఆదికి రుద్రంగి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డీసీసీ కార్యదర్శి గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement