● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల/వేములవాడఅర్బన్: డిగ్రీ బాలికల హాస్టల్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారం డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా డిగ్రీ బాలికల హాస్టల్ భవన నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. నాంపల్లి శివారులో నిర్మిస్తున్న మినీస్టేడియం పనులు పరిశీలించారు. చంద్రగిరిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, ఈఈ అశోక్‌కుమార్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, తహసీల్దార్ జయంత్‌కుమార్ తదితరులు ఉన్నారు.
గోడౌన్ల నిర్మాణానికి
కార్యాచరణ సిద్ధం చేయాలి
జిల్లాలో నూతన గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ), స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్(ఎస్‌డబ్ల్యూసీ), నాబార్డ్, పరిశ్రమలశాఖ, ఎల్‌డీఎం తహసీల్దార్లు, మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. గోడౌన్ల నిర్మాణాని స్థలాలు గుర్తించాలన్నారు.
22న జిల్లా స్థాయి సభ
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 22న జిల్లా స్థాయి సభ నిర్వహణకు ఏర్పాట్లు చే యాలని కలెక్టర్ ఆదేశించారు. ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సభలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సూచించారు. లబ్ధిదా రుల అభిప్రాయాలు వివరించాలని పేర్కొన్నారు.
18 నుంచి పర్యాటక శాఖ,
యువజన వారోత్సవాలు
ఈనెల 18 నుంచి 23 వరకు పర్యాటకశాఖ, యువజన వారోత్సవాలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 18న జిల్లా కేంద్రంలో 2కే రన్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. 21న స్పోర్ట్స్ డేలో భాగంగా సమ్మర్ క్యాంప్‌లకు హాజరవుతున్న పిల్లలతో స్పోర్ట్స్ డే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 23న మెగా జాబ్‌మేళా చేపట్టాలని తెలిపారు. ఆయా సమావేశాల్లో జిల్లా సహకార అధికారి రామకృష్ణ, మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, మార్క్ ఫెడ్ అధికారి హబీబ్, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ నరసింహ, నాబార్డ్ డీడీఎం దిలీప్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి, ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు, యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, పరిశ్రమల శాఖ అధికారులు హనుమంతు, భారతి, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.


