మద్దతు ధర పెంచాలి | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధర పెంచాలి

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతుఽ ధర పెంచాలి. క్వింటాల్‌పై వరికి రూ.70, పత్తికి రూ.220 పెంచి.. ఎరువుల ధరలు వందల్లో పెంచడం అన్యాయం. పొలాల్లో వరిగింజలు తాలు పోకుండా పొటాష్‌ చల్లుకునేటోళ్లం. రూ.800 ఉన్న పొటాష్‌ మూడేళ్లలో ఏకంగా రూ.1975కు పెరిగింది. కేంద్రం స్పందించి ఎరువులపై సబ్సిడీ పెంచాలి.

– బానాల లక్ష్మారెడ్డి, రైతు, కిష్టంపేట

సాగు భారంగా మారింది

పెరుగుతున్న సాగు ఖర్చులతో వ్యవసాయం భారంగా మారుతోంది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో కూలీ పెరిగింది. యంత్ర పరికరాల ధరలు పెరిగాయి. వీటన్నింటికి తోడు ఎరువుల ధరలు పెంచడం మరింత భారంగా మారింది. రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై ఎరువులు అందించాలి.

– కటకం చంద్రయ్య, రైతు, బండపల్లి

Advertisement
 
Advertisement
Advertisement