ఎప్‌సెట్‌లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఎప్‌సెట్‌లో ప్రతిభ

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

ఇల్లంతకుంట/వీర్నపల్లి: ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. వివిధ ప్రాంతాల్లో చదువుకున్న వారు ఎప్‌సెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లికి చెందిన దోనుపాటి మణిదీప్‌రెడ్డి 577వ ర్యాంక్‌ సాధించారు. ధోనుపాటి మనోహర్‌రెడ్డి, కవిత దంపతుల కొడుకు మణిదీప్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదివారు. ఇల్లంతకుంట మండలం తాళ్లల్లపల్లికి చెందిన ఇరుమల్ల ఉదయ్‌కిరణ్‌ 1,304 ర్యాంక్‌ సాధించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదివారు.

కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం

కోనరావుపేట(వేములవాడ): ధాన్యం కొనుగోళ్లపై జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తీసుకొచ్చి 50 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడంం, లారీలు రాకపోవడంతో కడుపుమండిన రైతులు ఆదివారం కోనరావుపేట మండలం వట్టిమల్లలో రోడ్డెక్కారు. రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లు ఇంత ఆలస్యం కాలేదన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. నెల రోజులుగా 10 కుప్పల ధాన్యం కూడా తరలించలేదన్నారు. ఎస్సై ప్రశాంత్‌రెడ్డి అక్కడికి చేరుకొని అధికారులతో మా ట్లాడించి రైతులకు నచ్చజెప్పారు. వట్టిమల్ల సర్పంచ్‌ గుండ వెంకటేశ్‌, ఉపసర్పంచ్‌ గంగారం సంపత్‌, గొల్లపల్లి మాజీ సర్పంచ్‌ గోపు పరశురాములు, వరాల మల్లేశం, గుండ శ్రీకాంత్‌, లింగారెడ్డి, మల్లారెడ్డి, సాయి, రాములు, శేషు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement