అమ్మ ప్రోత్సాహంతోనే ఐపీఎస్‌గా.. | - | Sakshi
Sakshi News home page

అమ్మ ప్రోత్సాహంతోనే ఐపీఎస్‌గా..

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

అమ్మ ప్రోత్సాహంతోనే ఐపీఎస్‌గా.. చేరదీసి.. మాతృ ప్రేమను పంచి

న్యూస్‌రీల్‌

గుర్తింపు లభించాలి

గోదావరిఖని(రామగుండం): నా విజయంలో చిన్నప్పటి నుంచి అమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మ కిరణ్‌కుమారిఝా కెమిస్ట్రి రిటైర్డ్‌ ఫ్రొఫెసర్‌. బిహార్‌ రాష్ట్రం మధుబని సొంత స్థలం. తండ్రి నందికిషోర్‌ఝా ఎంబీబీఎస్‌ డాక్టర్‌. సోదరి పారుల్‌ప్రియా సుంప్రీకోర్టు న్యాయవాది. సోదరుడు క్లిసైకిషోర్‌ఝా మైరెన్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో మా నిర్ణయానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సొంత ప్రాంతమైన మదుబనిలో 12వ తరగతి వరకు చదివా. తిర్చి ఎన్‌ఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశా. చిన్ననాటి నుంచి పోలీస్‌శాఖలో చేరాలనే ఆకాంక్ష ఉండేది. సివిల్స్‌ రాసి ఐపీఎస్‌గా ఉద్యోగం సాధించా. అమ్మ అన్ని విషయాల్లో తోడుంటూ మమ్మల్ని ప్రోత్సహించింది. ఏనాడూ టార్గెట్‌ పెట్టి చదివించలేదు. కెమిస్ట్రి ప్రొఫెసర్‌గా చేస్తూనే ఉన్నత విద్యాభ్యాసానికి బాటలు వేసింది. ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ రుణం తీర్చుకోలేనిది.

– అంబర్‌ కిశోర్‌ ఝా,

సీపీ, రామగుండం

తల్లీ.. నీకు

వందనం..

‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా’..

‘అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తీయనంటా’..

అని కొందరు సినీ కవులు అన్నట్లు అమ్మ మాటల్లో తీయదనం ఉంటుంది. సృష్టికి మూలమైన రెండక్షరాల అమ్మ అనే పదం ప్రతీ గుండెను తాకుతుంది. తల్లి తమ పిల్లలకు ధైర్యం నింపుతుంది. నవమాసాలు కడుపున మోయడంతో మొదలయ్యే తల్లి బాధ్యత తన చివరి అంకం వరకు ఉంటుంది. నాన్న భవిష్యత్‌ను తీర్చిదిద్దితే.. తల్లి బతుకును అందిస్తుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో పలువురు తల్లులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కన్న బిడ్డలను కంటికి పాపలా కాపాడుకుంటున్నారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. అచేతన స్థితిలో ఉన్న బిడ్డలకు అన్నీతానై సేవలందిస్తున్నారు. పేదరికం వారిని పగబట్టినా బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు మాతృమూర్తులు. ఆదిలోనే మాంగళ్య బంధం తెగిపోయినా అధైర్య పడకుండా నేనున్నాను అంటూ అండగా ఉంటున్నారు. బిడ్డలను ఉన్నత శిఖరాలకు చేర్చి వారి కళ్లలో ఆనందాన్ని నింపుకుంటూ అమ్మతనాన్ని చాటుకుంటున్నారు. అనాథలైన చిన్నారులను చేరదీసి వారికి అమ్మలవుతున్నారు మరికొందరు. కొందరు తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. పలువురు ఉద్యోగులు.. ఇంట్లో తల్లిగా.. సమాజంలో అధికారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భూదేవి అంత ఓపికతో.. కన్న బిడ్డలకు అండగా ఉంటున్న మాతృమూర్తి నీకు వందనం.. నేడు మదర్స్‌ డే సందర్భంగా...

కొత్తపల్లి(కరీంనగర్‌): కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్త శ్రీరాముల శ్రీనివాస్‌ సహకారంతో ఒత్తిడి తెలియకుండా ఉద్యోగంలో రాణిస్తున్నా. రెవెన్యూ శాఖలో పని ఒత్తిడి ఉన్నా ఇంట్లో అర్థం చేసుకునే భర్త, సహకరించే అత్త ఉండడం వల్లే ఉద్యోగం, ఇంటి బాధ్యతలను బ్యాలెన్స్‌ చేయగలుగుతున్నా. అమ్మ అనేది ఒక సంబంధం కాదు.. కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమానంగా నడిపించే శక్తి. మదర్స్‌ డే సందర్భంగా ప్రతీ తల్లికి గౌరవం, గుర్తింపు, సహకారం అందాలని కోరుకుంటున్నా.

– రేవెల్లి వెంకటలక్ష్మి,

తహసీల్దార్‌, కొత్తపల్లి

Advertisement
 
Advertisement
Advertisement