మాకున్న కొద్దిపాటి భూమిలో కూరగాయలు సాగు చేసుకుంటాం. మేము పండించిన కూరగాయలను వేములవాడకు తీసుకొచ్చి విక్రయిస్తుంటాం. స్వయంగా అమ్ముకోవడం ద్వారా లాభాలు వస్తాయి. కూరగాయలే మా కుటుంబానికి ఆధారం.
– కడుదుల లక్ష్మి, రైతు, కోనాయపల్లి
మాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నప్పటికీ 20 గుంటల్లో కూరగాయలు సాగుచేస్తాం. అందులో అన్ని రకాల పంటలను వేసి సొంతంగానే విక్రయిస్తాం. సీజన్‌ల వారీగా కూరగాయలు సాగుచేస్తాం. మంచి లాభాలు వస్తున్నాయి.
– కాసారపు పుష్పలత, రైతు, 13వ వార్డు, వేములవాడ


