30 ఎకరాల్లో పశుగ్రాసం దగ్ధం | - | Sakshi
Sakshi News home page

30 ఎకరాల్లో పశుగ్రాసం దగ్ధం

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

● రంగంపేటలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

● రంగంపేటలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని రంగంపేటలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు విద్యుత్‌ తీగలు ఒకదానికొకటి తగిలి పడిన నిప్పురవ్వలతో దాదాపు 30 ఎకరాల్లో కోసి పెట్టిన పశుగ్రాసం కాలిపోయింది. విద్యుత్‌ తీగలు తగిలి షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో ఎగిసిపడిన నిప్పురవ్వలు ఎండిన వరికట్టలపై పడడంతో మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పంటతోపాటు పొలాల వద్ద ఉన్న పైపులు, స్టార్టర్లు, విద్యుత్‌ వైర్లు కాలిపోయాయి. లూజ్‌ వైర్లతోనే ఏటా షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదాలు జరుగుతున్నాయని, తీగలను సరిచేయాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నాయకులు ప్రభుత్వానికి విన్నవించారు.

Advertisement
 
Advertisement
Advertisement