వైభవంగా మల్లన్న కల్యాణోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా మల్లన్న కల్యాణోత్సవం

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026

నారాయణపూర్‌లో మల్లికార్జునస్వామి కల్యాణానికి హాజరైన భక్తులు

మల్లన్న బోనాలతో భక్తులు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో భాగంగా సోమవారం కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున పురవీధుల గుండా మల్లన్న బోనాలు తీశారు. ఇంటికో బోనం చొప్పున మహిళలు బయలుదేరారు. దారి పొడవునా శివసత్తుల పూనకాలు, బైండ్ల కళాకారుల గాండ్రింపులు, ప్రత్యేక వేషధారణలతో నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఒగ్గు కళాకారులు కల్యాణం ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, సర్పంచ్‌ల ఫోరం మండల కన్వీనర్‌ దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ చైర్మన్‌ సాబేరా బేగం, వైస్‌చైర్మన్‌ గుండాడి రామ్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీలు ఎలుసాని మోహన్‌కుమార్‌, సుజాత, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు ఎలుసాని సునీల్‌కుమార్‌, నారాయణపూర్‌, రాగట్లపల్లి యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement