బయోగ్యాస్‌ ప్లాంట్‌కు భూమి పూజ | - | Sakshi
Sakshi News home page

బయోగ్యాస్‌ ప్లాంట్‌కు భూమి పూజ

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

● నేడు గంభీరావుపేటకు డిప్యూటీ సీఎం ‘భట్టి’ రాక

● నేడు గంభీరావుపేటకు డిప్యూటీ సీఎం ‘భట్టి’ రాక

గంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. గంభీరావుపేటలో బయోస్ట్రాటమ్‌ టె క్నాలజీస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం ఆధ్వర్యంలో భూమి పూజ చేయనున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం పాల్గొననున్నారు.

పర్యటనను విజయవంతం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు

గంభీరావుపేట మండలంలో మంత్రుల పర్యటనను కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, రైతులు విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీని వాస్‌ కోరారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అతి పెద్ద కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ గంభీరావుపేటలో ఏర్పాటు కాబోతుందని తెలిపారు. ఉపాధి కేంద్రంగా ప్లాంట్‌ దోహదపడనుందన్నారు. పర్ష హన్మండ్లు, మల్లుగారి నర్సాగౌడ్‌ తదితరులు ఉన్నారు.

మంత్రుల పర్యటనకు పటిష్ట భద్రత

మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు వివిధ శాఖల మంత్రుల పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. మంత్రుల పర్యటన దృష్ట్యా భద్రత ఏర్పాట్లు, హెలిప్యాడ్‌ను ఎస్పీ సోమవారం పరిశీలించారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేశ్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ రవి, ఆర్‌ఐలు మధుకర్‌, రమేశ్‌, ఎస్సై అనిల్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement