సిరిసిల్లటౌన్: ప్రజల బాధ్యతాయుత భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సిరిసిల్ల సాధ్యమైందని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ అన్నారు. గురువారం బల్దియా ఆధ్వర్యంలో స్థానిక రిసోర్స్ పార్క్‌లో నిర్వహించిన వేస్ట్ టు కంపోస్ట్ విండ్రో– వర్మి కంపోస్టింగ్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఇంటింటా తడి చెత్త సేకరణ నుంచి కంపోస్ట్ తయారీ వరకు అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. పట్టణాలను స్వచ్ఛతగా తీర్చిదిద్దడంలో పారిశుధ్య కార్మికులది చాలా కీలకమైన పాత్రన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో తడి పొడి, హానికరమైన చెత్తలను వేరు చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో వేయడాన్ని పూర్తిస్థాయిలో అరికట్టామని వివరించారు. కార్యక్రమానికి వివిధ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు హాజరై సిరిసిల్ల బల్దియా పరిధిలో నిర్వహిస్తున్న పద్ధతులను పరిశీలించి అభినందించారు. కంపోస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హేమలత పాల్గొన్నారు.


